![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక క్రేజీగా సాగుతోంది. అయితే ఈ వారం తనూజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, డీమాన్ పవన్ నామినేషన్లో ఉన్నారు.
అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, తనూజ స్వల్ప ఓట్ల తేడాతో టాప్ లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో డీమాన్ పవన్, రాము రాథోడ్ ఉన్నారు. మొన్నటి ఓటింగ్ లో భరణి లీస్ట్ లో ఉండగా.. నిన్నటి ఆటని బట్టి, భరణి ఫ్యాన్స్ గట్టిగానే ఓట్లు వేశారు. అందుకేనేమో డీమాన్ పవన్ ని అధిగమించి ఓ స్థానం పైకి వెళ్ళాడు. అయితే డీమాన్ పవన్ కి పెద్దగా ఓట్లేమీ పడటం లేదు.. అయితే రాము రాథోడ్ కి కూడా ఓటింగ్ తక్కువే ఉంది. భరణి నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి.. దివ్య నిఖితకి ఓట్లు తగ్గాయనిపిస్తోంది. దువ్వాడ మాధురితో దివ్యకి ఉన్న గొడవలు చూస్తుంటే ఆమెను ఈ వారం హౌస్ నుండి బయటకి పంపించడం కష్టమే అనిపిస్తోంది.
ఇక అందరితో పోలిస్తే రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే రాము నామినేషన్స్‌లోకి వచ్చాడు. అతనిపై పెద్దగా నెగిటివిటీ లేదు కానీ తన సత్తా ఏంటనేది ఈ రోజు అర్థరాత్రి ఓటింగ్ లైన్స్ పూర్తయ్యేవరకు తెలుస్తుంది. ఎక్కడ అన్ అఫీషియల్ ఓటింగ్ ని బట్టి చూస్తే మాత్రం ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత వారం శ్రీజ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ప్రకారం ఈ వారం డీమాన్ పవన్, భరణి, రాము రాథోడ్ లలో ఎవరు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు.
![]() |
![]() |